ఆటోను బైక్‌లా ఒక్క కాలితో గుండ్రంగా తిప్పేశాడు (వీడియో)

2910చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఆటో వెనుక వైపు నిలబడి ఉంటాడు. ఆటో వెనుక నిలబడ్డ అతను.. ఒక్కసారిగా కాలు నేలపై మోపి, చాలా చాకచక్యంగా ఆటో ఫ్రెంట్ టైరును గాల్లోకి లేపుతాడు. ఆటో ముందు భాగం మొత్తం గాల్లోకి లేచిన తర్వాత.. బైకుతో రౌండ్ వేసినట్లుగా.. ఆటోను కూడా గుండ్రంగా తిప్పేస్తాడు. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘ఇతడి టాలెంట్ వేరే లెవల్ అంటూ’’ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్