రెండుగా చీలి.. సమ్మె కొనసాగిస్తున్న ఉస్మానియా జూడాలు

69చూసినవారు
రెండుగా చీలి.. సమ్మె కొనసాగిస్తున్న ఉస్మానియా జూడాలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సమ్మె కొనసాగిస్తున్న జూనియర్‌ డాక్టర్లు రెండుగా చీలిపోయారు. ప్రభుత్వంతో జరిపిన చర్చల అనంతరం సమ్మెను తాత్కాలికంగా గాంధీ జూడాలు విరమించారు. జీవోలు విడుదల కాకపోతే రేపట్నుంచి మళ్లీ సమ్మెను కొనసాగిస్తామని ప్రకటించారు. కాగా తమ సమ్మె మాత్రం కొనసాగుతుందని ఉస్మానియా జూడాలు ప్రకటించారు. ఉస్మానియా నూతన బిల్డింగ్‌ విషయంలో క్లారిటీ రానిదే తమ సమ్మెను విరమించబోమని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్