షాక్‌లో SRH ఫ్యాన్స్

81చూసినవారు
షాక్‌లో SRH ఫ్యాన్స్
IPL-2024: KKRతో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో SRH ఘోరంగా విఫ‌ల‌మైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న SRH టీంలో టాపర్డ‌ర్ పూర్తిగా నిరాశ‌ప‌ర్చింది. హెడ్ గోల్డెన్ డక్ అవగా.. కెప్టెన్ కమిన్స్ 24 టాప్‌ స్కోర్ చేశాడు. మొత్తంగా SRH 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది. సీజన్ ఆసాంతం అద్భుతంగా రాణించిన టాపార్డర్ కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో చేతులేత్తేయ‌డంతో SRH ఫ్యాన్స్ షాక్‌కు గుర‌వుతున్నారు. SRH ఓన‌ర్ కావ్య మార‌న్ తీవ్ర నిరాశతో క‌నిపించారు.

సంబంధిత పోస్ట్