కోల్‌కతా నూతన పోలీస్ కమిషనర్‌గా మనోజ్ కుమార్ వర్మ నియామకం

83చూసినవారు
కోల్‌కతా నూతన పోలీస్ కమిషనర్‌గా మనోజ్ కుమార్ వర్మ నియామకం
కోల్‌కతా కొత్త పోలీస్ కమిషనర్‌గా మనోజ్ కుమార్ వర్మను నియమిస్తున్నట్లు బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పోలీసు వ్యవస్థలో కీలక మార్పులో భాగంగా ఈ నియామకం జరిగింది. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన నేపథ్యంలో కమిషనర్‌ ని మార్చాలని వైద్యులు డిమాండ్ చేశారు. దీంతో వినీత్ గోయల్‌ను బదిలీ చేసి, అతని స్థానంలో మనోజ్ వర్మను నియమించింది. 1998 బ్యాచ్ అధికారి మనోజ్ కుమార్ వర్మ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్)గా పనిచేశారు.

సంబంధిత పోస్ట్