ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల అమలులో లబ్దిదారులను గుర్తించడానికి రేషన్ కార్డుల్ని ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో అర్హులైన పేదలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకునే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.