కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు రేసింగ్ అంటే ఇష్టమని అందరికీ తెలిసిందే. ఇటీవల ఓ రేసింగ్‌లో పాల్గొన్న ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కారు మరోసారి ప్రమాదానికి గురైంది. స్పెయిన్‌లో జరుగుతున్న రేసింగ్‌లో మరో కారును తప్పించే క్రమంలో అజిత్ వెళ్తున్న కారు ట్రాక్‌పై పల్టీలు కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో అజిత్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.