సర్పంచులు, ఎంపీటీసీల పెండింగ్‌ బిల్లుల విడుదలకు చర్యలు: డిప్యూటీ సీఎం

73చూసినవారు
సర్పంచులు, ఎంపీటీసీల పెండింగ్‌ బిల్లుల విడుదలకు చర్యలు: డిప్యూటీ సీఎం
TG: సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పెండింగ్ బిల్లుల విడుదలకు ఆలోచన చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క పేర్కొన్నారు. దీనిపై ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్టంలో పెండింగ్ బిల్లులు సుమారు రూ.1,300 కోట్ల వరకు ఉన్నాయన్నారు. అందులో రూ. 10 లక్షల లోపు ఉన్న బకాయిల విలువ సుమారు రూ.400 కోట్లు ఉన్నట్లు చెప్పారు. ఈ విషయంపై BRS నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని భట్టి అన్నారు.

సంబంధిత పోస్ట్