తెలంగాణ ఆర్థికంగా ప్రగతి బాటలో పయనించాలంటే ఆర్యవైశ్యుల పాత్ర ఎంతో ఉంటుందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. మాజీ సీఎం స్వర్గీయ కొణిజేటి రోశయ్య మూడవ వర్ధంతి కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఆర్యవైశ్య ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ లో ఏదైనా మంచి ప్రదేశాన్ని గుర్తిస్తే అక్కడ రోశయ్య విగ్రహ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాలుగో వర్ధంతిలోపు విగ్రహ ఏర్పాటు జరగాలన్నారు.