నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
By Pavan 65చూసినవారుదేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 700 పాయింట్ల మేర నష్టపోయి 76,619.33 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 108.60 పాయింట్ల నష్టంతో 23,203.20 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్ నష్టాల్లో ముగిశాయి. జొమాటో, రిలయన్స్, నెస్లే ఇండియా, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.