దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఒడిదొడుకుల నేపథ్యంలో సూచీలు నష్టాల బాట పట్టాయి. దీంతో సెన్సెక్స్ 728.69 పాయింట్ల నష్టంతో 77,288 వద్ద ముగియగా నిఫ్టీ సైతం 181.80 పాయింట్లు క్షీణించి 23,486.85 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.85.69గా ఉంది. ఎన్టీపీసీ, జొమాటో, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.