దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్ 1547 పాయింట్లు లాభపడి 76,704 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 463 పాయింట్ల లాభంతో.. 23,292 వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీలో టాటా మోటార్స్, HDFC బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఎల్ అండ్ టి ప్రధానంగా లాభాలను ఆర్జించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరిగాయి.