ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే ఆర్సీబీ కొత్త వివాదానికి తెరలేపింది. ఆర్సీబీకి చెందిన ‘మిస్టర్ నాగ్స్’ ముంబై ఇండియన్స్‌ను ట్రోల్ చేశాడు. ఆర్సీబీ రజత్ పటీదార్ కొత్త కెప్టెన్ అయితే విరాట్, డుప్లెసిస్ అభినందనలు తెలిపి స్వాగతించారు. అయితే మిగతా జట్లలో కెప్టెన్సీ మార్పు ఇలా ప్రశాంతంగా జరిగిందా? ముంబై సంగతి తెలియదంటావా? అని నాగ్స్ ఎగతాళి చేస్తున్నట్లుగా RCB వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.