AP: విశాఖ స్టేడియం పేరు మార్పు వివాదంపై వైసీపీకి టీడీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. క్రీడలను రాజకీయాలను ముడి పెట్టొద్దన్నారు. స్టేడియానికి 30 ఏళ్లుగా ఉన్న పేరే ఉంది.. మేం ఏ పేరు మార్చలేదని స్పష్టం చేశారు. రాజకీయం చేయటం కోసమే వైసీపీ ఇదంతా చేస్తోందని విమర్శించారు. ఎందుకు వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారో వారికే తెలియాలన్నారు.