తిరుమల శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్ (స్విమ్స్)కు ఒక కోటి ఒక వెయ్యి నూటపదహారు రూపాయలను(1,00,01,116) విరాళంగా ఇచ్చారు. దాత ఎనర్‌టెక్ కామ్‌నెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అధినేత ఏవీ రమణరాజు.. తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా విరాళ దాత రమణరాజును తితిదే ఛైర్మన్, అధికారులు అభినందించారు.