'స్త్రీ 2' మూవీ టికెట్ ఆఫర్.. ఒకటి కొంటే మరొకటి ఉచితం

63చూసినవారు
'స్త్రీ 2' మూవీ టికెట్ ఆఫర్.. ఒకటి కొంటే మరొకటి ఉచితం
సినీ ప్రియులకు 'స్త్రీ 2' చిత్రబృందం శుభవార్త చెప్పింది. ఒక టికెట్ కొంటే మరొకటి ఉచితంగా పొందొచ్చని ప్రకటించింది. ఆఫర్ పొందేందుకు బుక్మై షో యాప్ లో STREE2 ప్రోమో కోడ్ ఉపయోగించాలని పేర్కొంది. సెప్టెంబరు 13న మాత్రమే ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అమర్ కౌశిక్ ఈ హారర్ కామెడీ మూవీ తెరకెక్కించారు. ఆగస్టు 15న బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ చిత్రం రూ.780 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్