మత్తుపదార్థాల మహా విధ్వంసాన్ని నిరోధించాలంటే ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. వాటి రవాణాను సమర్థంగా నిరోధించాలి. తయారీదారులు, రవాణా చేస్తున్న వారికి కఠిన శిక్షలు పడేలా చట్టాలను పదునుతేల్చాలి. ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాల వల్ల తలెత్తే నష్టాలపై సామాజిక, ప్రసార మాధ్యమాలు, పత్రికల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మత్తుపదార్థాలకు బానిసలైన వారిని మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్ళాలి. సరైన చికిత్స అందిస్తే ఆ జాడ్యం నుంచి బయటపడే అవకాశం ఉంది.