తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఎస్టీటీ డాటా సెంటర్ ముందుకొచ్చింది. ఈ సంస్థ రూ.3,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. శనివారం సింగపూర్‌లోని ఎస్టీటీ డాటా సెంటర్స్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంవోయూపై ఎస్టీటీ సీఈవో బ్రూనో సంతకాలు చేశారు. ఇప్పటికే హైటెక్ సిటీలో ఓ డాటా సెంటర్ నిర్వహిస్తోన్న ఎస్టీటీ.. ముచ్చర్ల మీర్ఖాన్పేట్లో మరో కొత్త డాటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.