మాజీ సీఎం జగన్‌కు చెక్‌పెట్టడానికి టీడీపీ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో మహానాడు మొదటి సారిగా కడప జిల్లాలో నిర్వహించనుంది. జగన్ సొంత నియోజకవర్గం కావడంతో దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఎక్కడ నిర్వహించినా ఈ మహానాడు ద్వారా పార్టీకి కొత్త ఊపును తీసుకురావాలనే ఆలోచనతో టీడీపీ నాయకత్వం ముందుకెళ్తోంది. అలాగే ఈ సభలోనే లోకేశ్‌కు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.