AP: రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీఎస్‌డీఎంఏ వెల్లడించింది. మరోవైపు, ఎండ తీవ్రత కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్మికులు, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఈరోజు కర్నూలు జిల్లా ఆస్పరి, సత్యసాయి జిల్లా తొగరకుంటలో అత్యధికంగా 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు.