ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ ఓపెనర్లు చెలరేగి ఆడుతున్నారు. ఆర్సీబీ ఓపెనర్ ఫిల్‌సాల్ట్ కేవలం 25 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇది ఫిల్‌సాల్ట్‌కు 7వ ఐపీఎల్ హాఫ్ సెంచరీ కాగా.. RCB తరఫున అతడికి తొలి అర్థశతకం. దీంతో ఆర్సీబీ స్కోర్ 7 ఓవర్లకు 86/0గా ఉంది. మరొక ఎండ్‌లో విరాట్ కోహ్లీ 34 పరుగులతో ఉన్నారు.