‘ఉచిత పథకాలకు ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటుంది కానీ భూసేకరణలో బాధితులకు చెల్లించేందుకు మాత్రం డబ్బు లేదా?’ అంటూ మహారాష్ట్ర సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అరవై ఏళ్లుగా బాధితుడికి డబ్బు చెల్లించకపోవడంపై సీరియస్ అయింది. మూడు వారాల్లోగా పరిహారం చెల్లించకపోతే మహారాష్ట్రలో ఉచిత పథకాలను నిలిపి వేయాలంటూ ఆదేశాలిస్తామని హెచ్చరించింది.