ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో చందు మొండేటి ఒకరు. తాజాగా తండేల్ మూవీతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్యతో తెలుగులో డైరెక్ట్‌గా ఓ మూవీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సూర్యకు తెలుగులో మంచి క్రేజ్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.