యాదాద్రి: ముద్దలుగా ఉన్న అన్నం తినలేక కడుపు మాడ్చుకుంటున్న విద్యార్థులు

55చూసినవారు
ముద్దలు ముద్దలుగా ఉన్న అన్నం తినలేక విద్యార్థులు కడుపులు మాడ్చుకుంటున్నారు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. మోత్కుర్ మండలానికి చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం వడ్డించిన అన్నం పూర్తిగా ముద్దలైందని, ఆ భోజనాన్ని తినలేక పడేసినట్లు విద్యార్థులు తెలిపారు. దీంతో ఆకలిని తట్టుకోలేక కొంతమంది విద్యార్థులు హోటల్‌లో టిఫిన్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై టీచర్‌లను అడిగితే తిరిగి కోప్పడుతున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్