ఎమ్మెల్యే సైదిరెడ్డి కి సీపీఐ అభినందనలు

2603చూసినవారు
ఎమ్మెల్యే సైదిరెడ్డి కి సీపీఐ అభినందనలు
హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని సీపీఐ ప్రత్యేకంగా అభినందిస్తున్నదని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనంజయ నాయుడు తెలిపారు. నేరేడుచర్ల సీపీఐ కార్యాలయం ప్రజా భవన్ నుంచి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. హుజూర్ నగర్ రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు కావడం లోనూ ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు కావడం లోనూ, ఎమ్మెల్యే కృషి ప్రశంసనీయమని, ఇంకా నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా పరిష్కరించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని అన్నారు. నేరేడుచర్ల మండలంలోని పలు గ్రామాలకు, రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి అని, ముఖ్యంగా నేరేడుచర్ల మున్సిపాలిటీ కేంద్రంలో హిందూ స్మశాన వాటిక అత్యంత అధ్వానంగా ఉన్నదని అన్ని గ్రామాల్లో, వైకుంఠధామం పేరుతో అన్ని సౌకర్యాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం స్మశాన వాటికలు నిర్మించిందని, మున్సిపాలిటీ అయ్యి కూడా ఎలాంటి సౌకర్యం లేకుండా నిండా కంప చెట్టు తో అత్యంత దరిద్రంగా ఉందని అన్నారు. వాటిని కూడా పరిష్కరించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్