గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల, విద్యార్థుల త్రాగు నీటి దృష్ట్యా గేల్ ఇండియా సహకారంతో లక్ష రూపాయలు విలువ చేసే ఆర్వో వాటర్ ప్యూరిఫైర్ ఏర్పాటు చేసారు. దానిని సోమవారం ప్రారంభం చేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్స కుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.