రైస్ మిల్ హమాలీలకు వేతనాలు పెంచాలని ఆ సంఘం గౌరవ అధ్యక్షులు మేకల నాగేశ్వరరావు హుజూర్ నగర్ రైస్ మిల్ అసోసియేషన్ నాయకులకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత వేతన ఒప్పందం పూర్తై 50 రోజులు దాటిందని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నూతన వేతనాలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకి అజయ్, పార్త పోయిన గురవయ్య, మన్యం చిన్న నాగేశ్వరరావు, రైస్ మిల్లు అసోషియేషన్ అధ్యక్షులు నరసింహారావు ఉన్నారు.