నేరేడుచర్ల పట్టణంలో ఈనెల 10న పురగిరి క్షత్రియ పెరిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రావణమాసం వనభోజన మహోత్సవం, నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమ పోస్టర్ ను గురువారం సంఘం జిల్లా అధ్యక్షులు వనపర్తి లక్ష్మీనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి కృష్ణయ్య, సముద్రాల రాంబాబు, కీత భద్రయ్య, పిన్నని జనార్ధన్, నిగిడాల సైదులు పాల్గొన్నారు.