అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను నెరవేర్చడంలో మీనమేషాలు లెక్కిస్తోందని భాజపా నియోజకవర్గ ఇన్చార్జి చల్లా శ్రీలతారెడ్డి అన్నారు. ఆదివారం గరిడేపల్లిలో జరిగిన మండల స్థాయి కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. ఇచ్చిన హామీలను దాటవేసే కాంగ్రెస్ ధోరణిలో ఉందన్నారు. రేషన్ కార్డులు ఇస్తామని రెండు నెలల నుంచి ప్రకటిస్తున్నా నేటి వరకు కార్యచరణ లేదన్నారు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, మండల అంజయ్య పాల్గొన్నారు.