కారును వెనుక నుండి ఢీకొట్టిన లారీ

23832చూసినవారు
పాలకీడు మండల పరిధిలోని జాన్ పహాడ్ దర్గా వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారును వెనక నుండి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం దెబ్బతింది. కారులో ఉన్న వారికి గాయాలు అయినట్లు తెలుస్తుంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్