హుజూర్ నగర్: తండ్రికి నెల మాసికం చేసిన మంత్రి ఉత్తమ్
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి గత నెల 29న అనారోగ్యంతో మృతి చెందిన విషయం విధితమే. కాగా సోమవారం హైదరాబాదులోని మంత్రి నివాసంలో తన తండ్రి పురుషోత్తం రెడ్డి నెల మాసికం నిర్వహించి పిండ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కుటుంబ సభ్యులు, బంధువులు మిత్రులు పాల్గొన్నారు.