రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని హుజూర్ నగర్ ఆర్డీవో శ్రీనివాసులు అన్నారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ జక్కుల నరేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి, ఇన్చార్జి తాసిల్దార్ నాగేందర్, సివిల్ సప్లై డిటి రాజశేఖర్, సీఈవో, నరేందర్ ఉన్నారు.