యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

77చూసినవారు
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని యోగా గురువు వేనేపల్లి ప్రసాదరావు అన్నారు. గురువారం కోదాడలోని భవాని నగర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యోగ సాధకులు రజని, పబ్బ గీత, రమ్య, వేనేపల్లి శ్రీనివాసరావు, సరిత, దివ్య, గుండపుణేని వేణుగోపాలరావు, అనసూర్య, శోభారాణి, పద్మ, వేనేపల్లి సత్యనారాయణ, బిఎస్ఎన్ఎల్ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్