అధ్వానంగా మారిన కోదాడ - వాయిల సింగారం రహదారి

1150చూసినవారు
అధ్వానంగా మారిన కోదాడ - వాయిల సింగారం రహదారి
కోదాడ నుండి వాయిల సింగారం వెళ్లే రహదారి గుంతల మయం అయ్యింది. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు అడుగడుగునా గుంతల్లో నీళ్ళు నిండి బైకులు, ఆటోలకు, అటువైపుగా ప్రయాణించే వారికి ఎంత లోతుల్లో ఉన్నాయో అర్థం కాక కింద పడే పరిస్థితి ఏర్పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా వాయిల సింగారం శివారులో ఉన్న డంపింగ్ యార్డుకు ప్రతినిత్యం కోదాడ మున్సిపాలిటీ ట్రాక్టర్లు తిరుగుతున్నాయి. కనీసం ఎవ్వరు పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్ మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్