కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. జనరల్ వార్డ్, ఎక్స్రే రూమ్, ప్రయోగశాలను పరిశీలించారు. ప్రతిరోజు ఎన్ని నమూనాలను సేకరించి రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారో కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అక్కడ నుండి ఫార్మసీ కేంద్రాన్ని పరిశీలించి పేషెంట్లకు ఇస్తున్న మందులను పరిశీలించారు.