తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిలుకూరు మండలం నారాయణపురం లో తుఫాను కారణంగా కూలిపోయిన ఇండ్లను, చెరువుకు పడిన గండిని పరిశీలించారు. రైతులకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు మేకల శ్రీనివాసరావు, మండల వెంకటేశ్వర్లు ఉన్నారు.