భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోనే అత్యధికంగా సూర్యాపేట్ జిల్లాలోని విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నమయ్యిందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ చెప్పారు. బుధవారం కోదాడ మండలంలో వరద ప్రభావంతో దెబ్బతిన్న రామాపురం, ఎంబీ గూడెం సబ్ స్టేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2127 స్తంభాలు, 319 ట్రాన్స్ఫార్మర్స్ లు ముంపుకు గురయ్యాయన్నారు.