కోదాడ లోని బాలాజీ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించాలని కోదాడ పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు షేక్ నయీమ్ అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గట్ల కోటేశ్వరరావు, చింతల నాగేశ్వరరావు, యూత్ అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్, అభిదర్ నాయుడు, చలిగంటి వెంకట్ ఉన్నారు.