డబల్ బెడ్ ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

52చూసినవారు
డబల్ బెడ్ ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
కోదాడలోని బాలాజీ నగర్ లో డ్రా పద్ధతిలో ఎంపిక చేసిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కోదాడ ఆర్డీవో కార్యాలయంలో అదనపు కలెక్టర్ బిఎస్ లతకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు కర్ల సుందర్ బాబు, మాజహర్, షేక్ అబ్బు, నర్సయ్య ఉన్నారు.

సంబంధిత పోస్ట్