కోదాడలోని నాగు బండి రామ్మూర్తి నగర్ లో దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన మతాబుల దుకాణాల వద్ద భారీ ఎత్తున సందడి నెలకొన్నది. దీపావళి పండుగ అంటే పిల్లల పండగ కావడంతో పిల్లల కోసం మతాబులు కొనుగోలు చేయడానికి తల్లిదండ్రులు దుకాణ సముదాయం వద్దకు పోటెత్తారు. ధరలు పేలుతున్నప్పటికీ పిల్లల పోరు తట్టుకోలేక కొనుగోలు చేయక తప్పడం లేదని వాపోతున్నారు.