ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాతో కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఎంఓయు సాంకేతిక మార్పిడి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ తెలిపారు. శనివారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ హైదరాబాదులో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో కోదాడ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలకు ఈ అరుదైన అవకాశం దక్కిందన్నారు.