కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి పాఠశాలలో జిల్లా సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాట్లు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రదర్శనల్లో భాగస్వాములయ్యే పాఠశాల ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయింది. ప్రదర్శనల స్టాల్స్ ఏర్పాటు చేపట్టారు. వివిధ కమిటీలు తమకు కేటాయించిన విధులకు ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించారు. కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్, డిఎస్ఓ దేవరాజ్, కమిటీల కన్వీనర్ లు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.