ప్రపంచంలో తెలుగుజాతికి గుర్తింపు తెచ్చిన మహానీయుడు ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు గుళ్లపల్లి సురేష్ అన్నారు. శనివారం ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర, హరినాథ్, షేక్ బాబా షర్ఫుద్దీన్ ఉన్నారు.