కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వేగ్గలం నరేష్ చారి శని వారం మాజీ ముఖ్య మంత్రి ఎన్టిఆర్ వర్ధంతి సందర్భంగా అంగుళం సుద్ద ముక్కపై ఎన్టీఆర్ ప్రతిమ ను చెక్కి తన కళాత్మకతను చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మ వస్తువులపై అనేక అద్భుత కళాఖండాలను ఆవిష్కరించి పలువురి మన్నలను పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మకళలో రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తెస్తాననిచారి అభిప్రాయం వ్యక్తం చేశాడు.