కోదాడ హాస్టల్ ఉద్యోగి సూసైడ్ నోట్ కలకలం

6707చూసినవారు
కోదాడ హాస్టల్ ఉద్యోగి సూసైడ్ నోట్ కలకలం
అధికారుల వేధింపులు తట్టుకోలేక చనిపోతానని సూసైడ్ లెటర్ రాసి ఓ హాస్టల్ ఉద్యోగి ఇంటి నుండి వెళ్లిపోయిన సంఘటన కోదాడలో సోమవారం జరిగింది. ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం డిప్యుటేషన్ పై చిలుకూరు హాస్టల్ లో పనిచేస్తున్న కాంపాటి గోపయ్య బీసీ బాలుర హాస్టల్ వార్డెన్ రెండు నెలలుగా జీతాలు, ఇంక్రిమెంట్లు చేయడం లేదని, చనిపోతానని లెటర్ రాసి వెళ్లినట్టు పేర్కొన్నారు. భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్