కోదాడ మండలం, తొగర్రాయిలో దెబ్బతిన్న బ్రిడ్జీలను, ప్రాంతాలను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు అధైర్య పడవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం అందరిని ఆదుకుంటుందన్నారు. పునరావాస కార్యక్రమాలకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా బాధితులకు అండగా ఉండాలన్నారు. అధికారులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉన్నారు.