అనంతగిరి మండలం లక్కవరం గ్రామంలో నాగుల చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. భక్తులు తెల్లవారుజామునే నాగమ్మ తల్లి పుట్ట వద్దకు చేరుకొని పుట్టలో పాలు పోసి పండ్లు సమర్పించి కోరిన కోర్కెలు తీర్చమని నాగమ్మతల్లి ని వేడుకున్నారు ఆలయం దగ్గరకు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కమిటీ నిర్వాహకులు గాయం ఉపేందర్ రెడ్డి తెలిపారు.