మునగాల మండల పరిధిలోని గణపవరం గ్రామానికి చెందిన పగిళ్ల మహేశ్వరి మోడల్ స్కూల్ విద్యార్థిని గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. శనివారం మోడల్ స్కూల్ ఇంటర్ విద్యార్థులు మోడల్ స్కూల్ విద్యార్థుల సహకారంతో మహేశ్వరి కుటుంబ సభ్యులకు 6 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ఇంటర్ విద్యార్థులు వైశాలి, హన్సిక, హారిక, సింధు, రేవంత్, నిఖిల్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.