కోదాడ పట్టణంలో ప్రధాన రహదారుల పక్కన ఆక్రమణలను బుధవారం మున్సిపల్ అధికారులు పోలీసు పహారాతో తొలగించారు. ఆక్రమణల వల్ల రహదారి పైనుండి వచ్చే నీరు డ్రైనేజీల్లోకి వెళ్లకుండా ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు ఈ చర్యలు చేపట్టారు. పట్టణంలో వరద బీభత్సానికి వాగులు వంకలు ఆక్రమణ చేయడమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు ఉన్నారు.