సోమవారం కనీస వేతనాలు లేక పెరుగుతున్న ధరలతో కుటుంబాలను పోషించలేకపోతున్నామని ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులను పట్టించుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వారు అన్నారు. సోమవారం అనంతగిరి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులు 33 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాతో చర్చలు జరపకపోవడం మా సమస్యలను పరిష్కరించకపోవడం పట్ల ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని తెలుస్తుందని అన్నారు.