నల్గొండ: స్కూల్ పిల్లల ఆటోను ఢీ కొట్టిన బొలెరో వాహనం

73చూసినవారు
నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో గల హనుమంత్ కాంప్లెక్స్ సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ వైపునకు వస్తున్న స్కూలు పిల్లల ఆటోను బొలెరో వాహనం వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్